ఆన్లైన్ ఆటలు.. ఓ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురి చేశాయి. ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసే పరిస్థితులను సృష్టించాయి. విద్యలో ముందుండే ఆ విద్యార్థి విధిని మార్చేలా చేశాయి.
ఇంతకీ ఏమైందంటే..
ఆన్లైన్ ఆటలు.. ఓ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురి చేశాయి. ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసే పరిస్థితులను సృష్టించాయి. విద్యలో ముందుండే ఆ విద్యార్థి విధిని మార్చేలా చేశాయి.
ఇంతకీ ఏమైందంటే..
ఏపీలోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచికాపలం గ్రామానికి చెందిన యోగేశ్ ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడికి కంటి చూపు సరిగా లేదు. అయినా చదువులో ముందుంటాడు. ప్రభుత్వ పింఛను కూడా పొందుతున్నాడు. కరోనా కారణంగా లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటూ.. సెల్‌ఫోన్ వాడటం ఎక్కువైంది. అలా యోగేశ్‌కు ఆన్లైన్ ఆటలపై మక్కువ పెరిగింది. లాన్‌డౌన్‌లో ఇంటిపట్టునే ఉంటూ చరవాణి ద్వారా ఆన్లైన్ ఆటలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే బెట్టింగ్‌లు మెుదలుపెట్టాడు. డబ్బులు వస్తున్నాయనుకున్న యోగేశ్.. అప్పులపాలయ్యాడు.
ఏం చేయాలో యోగేశ్‌కు అర్థం కాలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బిడ్డపై మమకారంతో.. మానసికంగా బాధపడుతున్నాడని.. 2 లక్షలు చెల్లించారు. అయినా యోగేశ్‌కు అప్పుల బాధ తప్పలేదు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన అతను.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి తల్లి కేకలు వేసింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. యోగేశ్‌ను తిరుపతికి తరలించారు.