శబ్ద కాలుష్యం చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై సురేశ్ హెచ్చరించారు. సిబ్బందితో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
భద్రాచలం పట్టణంలో బుల్లెట్ ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్లను పరిశీలించారు. ఎక్కువ శబ్దం వచ్చే వాటిని తొలగించేస్తున్నారు. జరిమానా విధిస్తున్నారు.