నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి గ్రామంలో దారుణం జరిగింది. తిడుతున్నాడన్న కారణంగా గణేష్ అనే వ్యక్తి తన తండ్రిపైనే దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసరెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తిడుతున్నాడని తండ్రిని చంపిన తనయుడు - నాగర్ కర్నూలు జిల్లా వార్తలు
దూషించాడన్న కారణంగా తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. ఈ దారుణమైన ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కన్న తండ్రినే హతమార్చిన కసాయి కొడుకు
తండ్రిని ఎందుకు చంపావంటూ గ్రామస్థులు నిందితున్ని ప్రశ్నించగా తనను దూషించిన కారణంగానే దాడికి పాల్పడ్డానని సమాధానమిచ్చాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:రిపబ్లిక్ డే రోజున 'కిసాన్ పరేడ్'