తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగి కరెంట్​షాక్​తో మృతి - తిరువనంతపురంలో తెలంగాణ రైల్వే ఉద్యోగి మృతి

తిరువనంతపురంలో విధుల్లో ఉన్న తెలంగాణకు చెందిన రైల్వే ఉద్యోగి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. రైలు పైభాగంలో మరమ్మతులు చేసే సమయంలో ప్రమాదం సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు.

A railway employee on duty died of electric shock at Thiruvananthapuram
విధుల్లో ఉన్న రైల్వే ఉద్యోగి కరెంట్​షాక్​తో మృతి

By

Published : Oct 3, 2020, 7:41 PM IST

తెలంగాణకు చెందిన రైల్వే ఉద్యోగి కేరళలోని తిరువనంతపురంలో కరెంట్​ షాక్​తో మృతి చెందాడు. సెంట్రల్ రైల్వే స్టేషన్ రైలు పైభాగంలో మరమ్మత్తులు చేసే సమయంలో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. కోచ్, వాగన్ డిపో అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న వచనగిరి దత్తు వరంగల్ జిల్లాకు చెందిన హన్మకొండలోని బాలసముద్రం నివాసిగా గుర్తించారు.

అతను రైలు ఎక్కడానికి ఉపయోగించిన నిచ్చెన అనుకోకుండా విద్యుత్ లైన్​ను తాకింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. రైల్వే పోలీసులు విచారణ పూర్తి చేసి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి తరలించారు. కొవిడ్ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత రేపు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి :వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details