లాటరీ వచ్చిందని చెబితే నమ్మి ఓ ఉద్యోగిని రూ. 6 లక్షలు పోగొట్టుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వారాసిగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని తల్లికి నాప్‌టూల్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతా నుంచి స్పీడ్ పోస్టు వచ్చింది. అందులో రూ. 12 లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారని ఉంది. 'మీరు కోరితే కారు లేదా నగదు పొందవచ్చు' అని ఉండటంతో అందులోని నంబర్‌ను ఉద్యోగిని సంప్రదించి డబ్బులే కావాలని కోరింది.
బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే డిపాజిట్ చేస్తామని మోసగాడు నమ్మించాడు. బాధితురాలు ఖాతా నంబరు ఇచ్చాక వివిధ ఖర్చుల పేరిట రూ. 6 లక్షలు వేయించుకుని ఆ తర్వాత స్పందించడం మానేశాడు.