తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బావిలో దూకి ఎనిమిది నెలల గర్భిణి మృతి - Pregnant woman commits suicide in KRISHNA district

ఎనిమిది నెలల గర్భిణి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా ముసునూరులో జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బావిలో దూకి ఎనిమిది నెలల గర్భిణి మృతి
బావిలో దూకి ఎనిమిది నెలల గర్భిణి మృతి

By

Published : Dec 3, 2020, 10:22 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా ముసునూరులో విషాదం జరిగింది. తలకొండ నాగరాజు కుమార్తె లక్ష్మీ దుర్గకు నూజివీడుకి చెందిన మన్మధరావుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంది. ప్రస్తుతం 8 నెలల గర్భిణి. మరికొన్ని రోజుల్లో చిన్నారికి జన్మనివ్వాల్సిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. గ్రామ సమీపంలోని ఓ బావిలోకి దూకింది. దూరం నుంచి చూసిన మహిళలు ఆమెను కాపాడేందుకు ధైర్యం చేయలేకపోయారు.

గట్టిగా వారు కేకలు వేయటంతో స్థానికులు బావిలోకి దిగే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. లక్ష్మీదుర్గ అప్పటికే ఊపిరాడక మృతి చెందింది. మృతదేహన్ని పోలీసులు, 108 సిబ్బంది గాలం సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం కోసం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కులపెద్దగా తప్పించాలనే హత్య చేశారు: డీసీపీ నారాయణ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details