జడ్చర్లలో పనిచేసుకొంటున్న అలంపూర్‌కు చెందిన రాంబాబుకు కోర్టులో అటెండరు ఉద్యోగం ఇప్పిస్తానంటూ చంద్రశేఖర్ దగ్గర రూ.6.50 లక్షలు వసూలు చేశాడు. ఇతని బంధువు, జడ్చర్లకు చెందిన బాలస్వామికి భూమి ఇప్పిస్తానంటూ రూ.2.65 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఇదే కుటుంబానికి చెందిన వనపర్తిలో ఉండే వ్యక్తి నుంచి హోంగార్డు ఉద్యోగం పేరిట రూ.1.50 లక్షలు వసూలు చేశారు. ఒకే కుటుంబంలోని ముగ్గురి నుంచి మొత్తం రూ.10.65 లక్షలు వసూలు చేశాడు. బాధితుడు రాంబాబు సోదరుడు నాగరాజు జడ్చర్ల ఠాణాలో నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.
రాజకీయ నేత కుమారుడి ప్రమేయం!
నిందితుడు చంద్రశేఖర్ హన్వాడ మండలానికి చెందిన ఓ రాజకీయ పార్టీ నేత కుమారుడితో కలసి ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల పేరిట వసూలు చేయాలనుకున్న సొమ్మును రాజకీయ నేత కుమారుడి ఖాతాలో జమ చేయించేవారు. చంద్రశేఖర్‌కి హన్వాడకు చెంది మరో వ్యక్తి కూడా సహకారం అందించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలసి ఖాతాలో జమ అయిన డబ్బును షాద్‌నగర్‌లో డ్రా చేసుకునేవారని సమాచారం. మహబూబ్‌నగర్ గ్రామీణ ఠాణా పోలీసుల అదుపులో ఉన్న నిందితులను జడ్చర్లకు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలిసింది. బుధవారం లేదా గురువారం నిందితుడిని, అతనికి సహకరించిన వారిని రిమాండుకు తరలించనున్నట్లు సమాచారం.