తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆడపిల్ల పుట్టిందని... పక్కనోళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లాడు! - మగబిడ్డను కిడ్నాప్ చేయబోయిన వ్యక్తి

పుట్టని పాపను వదిలేసి వేరే వారికి జన్మించిన మగశిశువును ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. తన బిడ్డ కనిపించడంలేదని గాంధీ ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేసింది ఆ తల్లి. లేబర్ వార్డులో అనుమాస్పదంగా తిరిగుతున్న కిడ్నాపర్​ను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు ఆసుపత్రి సెక్యురిటీ.

Breaking News

By

Published : Feb 25, 2020, 6:37 PM IST

హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలోని ఎన్​ఐసీయూ ఉంచిన మగ శిశువును ఓ వ్యక్తి కిడ్నాప్​ చేయబోయాడు. ఆడపిల్ల పుట్టడం.. ఆమెకు కాస్త అనారోగ్యంగా ఉండడం సహించలేని ఆ తండ్రి వక్రబుద్ధితో ఆలోచించాడు. ఎన్​ఐసీయూ ఉంచిన తన పాపను చూసేందుకు వెళ్లి అక్కడే ఉన్న మగశిశువును ఎత్తుకొని బయటకు వచ్చాడు. తమ బిడ్డ కనిపించకపోయే సరికి అప్రమత్తమైన స్వరూప ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. బాబును ఎత్తుకొని లేబర్​ వార్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న కిడ్నాపర్​ను సెక్యురిటీ సిబ్బంది పట్టుకుని చిలకలగూడ పోలీసుకు అప్పగించారు.

గాంధీ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం

ABOUT THE AUTHOR

...view details