మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు కాలనీలో వెంకన్న అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వెంకన్న పై అంతస్తుకి వెళ్లి ఎంతకూ కిందికి రాకపోవడంతో పైకి వెళ్లి చూశామని... ఉరి వేసుకొని కనిపించడంతో కిందికి దించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకన్నను పరిశీలించిన డాక్టర్లు మృతిచెందాడని చెప్పడంతో ఇంటికి తీసుకు వచ్చామని అన్నారు.
మహబూబాబాద్‌లో ఇంట్లోనే వ్యక్తి అనుమానాస్పద మృతి - మహబూబాబాద్ లేటెస్ట్ న్యూస్
మహబూబాబాద్‌లో జిల్లా కేంద్రంలో వెంకన్న అనే వ్యక్తి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. పై అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకోగా... కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని అన్నారు.
మహబూబాబాద్‌లో ఇంట్లోనే వ్యక్తి అనుమానాస్పద మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:అన్నాచెల్లి అదృశ్యం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు