పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఈ నెల ఒకటిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. అదే గ్రామానికి చెందిన మర్రి రాంబాబే చోరికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మర్రి రాంబాబును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. మనస్తాపానికి గురైన రాంబాబు శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడ్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం ఎదుట రాంబాబు కుటుంబీకులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాయత్నం - yuvakudu aaatma hatyaa prayathnam
చేయని నేరాన్ని తమపై ఆపాదించి, పోలీసులు తీవ్రంగా కొట్టారని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల తీరును నిరసిస్తూ పినపాక డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు రాంబాబు కుటుంబీకులు.
డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగిన రాంబాబు కుటుంబీకులు