తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చోరీని అడ్డుకోబోయిన యువకుడిపై కత్తితో దాడి - sangareddy crime updates

చోరీ యత్నాన్ని అడ్డుకోబోయిన యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. గొంతు, కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో తీవ్రంగా గాయపరిచి దొంగ పారిపోయాడు. యువకుడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

a person resisted the robbery attempt and seriously injured in jaheerabad
చోరీని అడ్డుకోబోయిన యువకుడిపై కత్తితో దాడి

By

Published : Nov 1, 2020, 9:45 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో అర్ధరాత్రి చోరీ యత్నాన్ని అడ్డుకోబోయిన యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి దొంగ పరారయ్యాడు. జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ కూడలిలోని కాంప్లెక్స్​లో ఓ దొంగ చోరీకి యత్నిస్తుండగా అక్కడే ఉన్న రిజ్వాన్(19) అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు, కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో పొడిచి దొంగ పరారయ్యాడు.

తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని గుర్తించిన వ్యక్తులు స్థానిక వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన దృశ్యాలు సీసీ పుటేజ్​లో నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలింపు మొదలుపెట్టారు.

ఇదీ చూడండి:దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details