జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల్లో తోడబుట్టిన అన్నను తమ్ముడు బలితీసుకున్నాడు.
ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు - తెలంగాణలో నేర వార్తలు
ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ అన్నను బలితీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10068642-568-10068642-1609401986294.jpg)
అన్నను తమ్ముడు హత్య
గ్రామానికి చెందిన బయ రాజయ్య(60), అతని తమ్ముడు నరసయ్య మధ్య కొన్నిరోజులుగా ఆస్తి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గొడవ పెద్దది కావడంతో నరసయ్య రోకలిబండతో రాజయ్య తలపై బాదాడు. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వెంచర్లో మహిళ మృతదేహం.. దారుణ హత్య!