వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ప్రేయసిని కలవడానికి అడ్డు వస్తున్నాడని ఆమె ప్రేమికుడిని కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచిన ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్లో ఆఫ్రీన్ అనే ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ మొహమ్మద్ అన్సారీ అహ్మద్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆఫ్రీన్‌కు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు కాగా, అన్సారీ అహ్మద్ వల్ల మరో ఇద్దరు పిల్లలు జన్మించారు.
కొద్దిరోజుల కిందట ఆఫ్రీన్, ఆమె సోదరుడు ఖాసీం మరో వ్యక్తి ఇమ్రాన్‌తో కలిసి అన్సారీకి సమాచారం ఇవ్వకుండా ముంబయి వెళ్ళారు. అన్సారీ ఫోన్ చేసి వెనక్కి రమ్మని హెచ్చరించడంతో ముగ్గురూ తిరిగి ఎల్లమ్మబండకు చేరుకున్నారు. ఇమ్రాన్‌ను కలిసిన అన్సారీ... ఆఫ్రీన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. ఆగ్రహించిన ఇమ్రాన్ అతడి అడ్దు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి దగ్గర రోడ్డుపై ఒంటరిగా ఉన్న అన్సారీ కళ్లలో కారం కొట్టి... తన వద్ద ఉన్న కత్తితో 22 పోట్లు పొడిచాడు.