యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సుద్దాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గూడ కిష్టమ్మ ఇటీవల మృతి చెందడంతో మంగళవారం దశదిన కర్మ కార్యక్రమంలో గూడ సోమయ్య (60) తమ కులస్థులతో కలిసి చెరువులో స్నానాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై చందర్, ఆర్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి... గాలింపు చర్యలు చేపట్టారు.
దశదిన కర్మలకు వెళ్లి... తిరిగిరాని లోకాలకు - యాదాద్రి భువనగిరి తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. దశదిన కర్మలకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో స్నానం చేస్తూ గల్లంతయ్యారు. ఎంతసేపటికీ వ్యక్తి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాలింపు చర్యల్లో వ్యక్తి మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
దశదినకర్మలకు వెళ్లి... తిరిగిరాని లోకాలకు
గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతదేహానికి శవపరీక్ష కోసం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చందర్ తెలిపారు.
ఇదీ చదవండి:దంత వైద్యుడు హుస్సేన్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు