మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలో నివాసముండే విశ్రాంత శాస్త్రవేత్త ఆనంద్ ఖాతా నుంచి 12 లక్షలు కాజేశాడు ఓ యువకుడు. అతను సిండికేట్ బ్యాంకుకు వెళ్లి ఖాతాలో ఉన్న నగదు నిల్వపై ఆరా తీయగా మోసం బయటపడింది. అతని ఇంట్లో పనిమనిషిగా చేరిన సంపత్‌పై అనుమానంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునితో పాటు సహకరించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
యజమాని ఏటీఎంతో 12 లక్షలు డ్రా...నిందితులు అరెస్ట్ - మేడ్చల్ జిల్లా నేర వార్తలు
తాను పనిచేసిన ఇంటి యజమాని ఏటీఎం తస్కరించిన ఓ యువకుడు ఏకంగా 12 లక్షలు కాజేశాడు. దీనికి అతని తల్లిదండ్రులు కూడ సహకరించారు. మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలో ఉండే విశ్రాంత శాస్త్రవేత్త బ్యాంకుకు వెళ్లి ఖాతాను తనిఖీ చేయగా విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సంపత్ అనే యువకుడు ఆనంద్ ఇంట్లో రెండు నెలలు పనిచేసి అక్టోబర్‌లో పనిమానేశాడు. ఆ తర్వాత యజమాని ఏటీఎం తస్కరించి దశలవారీగా 12 లక్షలను నగదును డ్రా చేశాడు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా సహకారం అందించారు. ఈ నెల 27న యజమానిఆనంద్ సిండికేట్ బ్యాంకుకు వెళ్లి ఖాతాలో నగదును తనిఖీ చేశాడు. బ్యాంకు సిబ్బంది 7 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనంద్ ఏటీఎంపైనే రహస్య నంబరును రాయడంతో సులభంగా నగదు డ్రా చేసినట్లు సంపత్ తెలిపాడు. అతనితోపాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.