ద్వి చక్రవాహనం అదుపుతప్పి... గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్ పూర్‌లో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం గోటిలగుట్ట తండాకు చెందిన రాజు హైదరాబాదు వెళ్తుండగా... హరిదాస్ పూర్ శివారులో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. రాళ్ల మధ్యలో తల ఇరుక్కుపోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
అదుపుతప్పిన ద్విచక్రవాహనం... యువకుడు మృతి - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా హరిదాస్ పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గోటిలగుట్ట తండాకు చెందిన రాజుగా గుర్తించారు.
అదుపుతప్పిన ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి
ఈ ఘటనతో మృతుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గోటిలగుట్ట తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి