తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'ఒంటరిగా పుట్టా.. ఒంటరిగా చస్తున్నా.. జీవిత పోరాటం నావల్ల కాలేదు'

"ఒంటరిగా ఏడుస్తూ పుట్టాను. ఒంటరిగా ఏడుస్తూ చస్తున్నాను. జీవితమే ఓ పోరాటం... అది నా వల్ల కాలేదు" ఇవి ఏ సినీ కవి రాసిన అక్షరాలో అనుకుంటే పొరపాటే. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ యువకుడు... అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తూ... నా చావుకు ఎవరూ బాధ్యులు కారు అని... చెబుతున్న మాటలు...

Suspicious death of a youth in Kurnool district
కర్నూలు జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి

By

Published : Nov 13, 2020, 2:22 PM IST

డిగ్రీ చదివి బంగారు భవిష్యత్తు గురించి కలలు కంటూ... పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో నూనెపల్లెకు చెందిన వెంకటకృష్ణ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా బ్యాంకు కోచింగ్ తీసుకుంటూ.. స్థానికంగా... ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. గదిలో పైన ఉన్న కొక్కికి, టవల్​తో ఉరివేసుకుని మృతి చెందాడు. చేతులకు, కాళ్లకు తాడుతో కట్టి ఉండడంతో ఇది ఆత్మహత్యా లేక హత్యా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో

"ఐ హేట్ మై లైఫ్ . నా చావుకు ఎవరు బాధ్యులు కారు . ఒంటరిగా ఏడుస్తూ పుట్టాను. ఒంటరిగా ఏడుస్తూ చస్తున్నాను. జీవితంతో పోరాటం నా వల్ల కాలేదు" అని రాసి ఉంది.

ABOUT THE AUTHOR

...view details