యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కడుపు నొప్పి భరించలేక బిక్కంటి ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య - yadadri district latest news
కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఎల్లయ్య దసరా పండుగ సందర్భంగా అతిగా తీసుకున్న ఆహారం కడుపు నొప్పికి దారి తీసింది. నొప్పిని భరించలేని ఎల్లయ్య తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఇదీ చూడండి..దారుణం: కన్న కొడుకును కడ తేర్చిన తల్లి