సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పరిసరాల్లోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కొల్లాపూర్ చెందిన వడ్డే పాపయ్యగా గుర్తించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు - sangareddy district crime news
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు
వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి జహీరాబాద్‌కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్ చేసిన దృశ్యాలు