జగిత్యాల జిల్లా ఇస్లాంపురలో కిడ్నాపర్‌గా భావించి ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు బిహార్ వాసిగా పోలీసులు గుర్తించారు. ఓ ఇంటి ముందు నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అపహరించేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు.
కిడ్నాపర్‌గా భావించి యువకుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు - జగిత్యాల జిల్లా నేర వార్తలు
జగిత్యాల జిల్లా ఇస్లాంపురలో బిహార్‌కు చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాలుగేళ్ల బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు తెలిపారు.
కిడ్నాపర్‌గా భావించి యువకున్ని పోలీసులకు అప్పగింత
యువకుడిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా అతనికి మతిస్థిమితం లేదని పోలీసులు వెల్లడించారు. అతని వివరాలను బిహార్‌లోని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.