వైకాపా నాయకులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. మహమ్మద్ హనీఫ్ అనే మౌజమ్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాపిరెడ్డి పాలెంలో గత కొన్నేళ్లుగా మహమ్మద్ హనీఫ్ మౌజమ్గా పనిచేస్తున్నారు. రెండు రోజుల కిందట తాపిరెడ్డిపాలెంలోని ఖబరిస్తాన్లో గ్రావెల్స్ తవ్వుతున్న కొందరు వ్యక్తులను హనీఫ్ అడ్డుకున్నారు.
వీడియో వైరల్: వైకాపా నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం - Suicide attempt by Muslim Maujam in Guntur district
వైకాపా నేతల వేధింపులు తాళలేకపోతున్నానని ఆవేదన చెందుతూ.. మౌజమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగింది. ఆత్మహత్యాయత్నానికి ముందు.. బాధితుడు తీసుకున్న సెల్పీ వీడియో ఇప్పడు వైరల్గా మారింది.
వీడియో వైరల్: వైకాపా నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
ఈ క్రమంలో.. కొందరు ఆదివారం సాయంత్రం మహమ్మద్ హనీఫ్పై దాడికి దిగారు. వైకాపా నేతలే ఈ పని చేశారని హనీఫ్ ఆరోపించారు. ఈ ఘటనను.. అవమానంగా భావిస్తూ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు సెల్ఫీ వీడియో తీశాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.