ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు - నేర వార్తలు
18:42 July 05
ఎనిమిదేళ్ల చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు నాలుగు రోజుల క్రితం ఎనిమిదేళ్ల ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల ఆశచూపి ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరికి చెప్పొద్దని భయపెట్టాడు. నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు కామాంధుడు నారాయణను(55) చితకబాది పోలీసులకు అప్పగించారు. చిన్నారుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత చిన్నారులను బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'