నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి బక్కన్న (70) అనే వృద్ధుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బక్కన్న నదిలోకి దూకగానే గమనించిన స్థానికులు కాపాడడానికి ప్రయత్నించారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు.
గోదావరిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య - etv bharath
జీవితంపై విరక్తి పుట్టి.. బతకలేక ఓ వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గోదావరిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో చెట్టుకు వేలాడుతూ వృద్ధుని మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.