తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాగునీటి బావిలో నవజాత శిశువు.. ఎందుకు పడేశారో..? - etv bharath

అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును తాగునీటి బావిలో పడేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటుచేసుకుంది. శిశువు మృతదేహం బావిలో తేలటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

A newborn baby falling into a well in jagityala district
తాగునీటి బావిలో నవజాత శిశువు.. ఎందుకు పడేశారో..?

By

Published : Sep 12, 2020, 9:30 PM IST

Updated : Sep 12, 2020, 10:21 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువును తాగునీటి బావిలో పడేశారు. శిశువు మృతదేహం బావిలో తేలటంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు.

శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో గర్భిణీలు ఎవరున్నారు.. ఎక్కడ ప్రసవం జరిగింది.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Sep 12, 2020, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details