మేడ్చల్ జిల్లా మురహరిపల్లి చౌరస్తా వద్ద మినీ బస్సును ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేటకు చెందిన హరీశ్.. జీడిమెట్ల సూరారం మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూడడానికి వెళ్తున్నాడు.
మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి - Medcahl road accident
మేడ్చల్ జిల్లా మురహరిపల్లి చౌరస్తా వద్ద మినీ బస్సును ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి
మురహరిపల్లి వద్ద మినీ బస్సు మలుపు తిరుగుతుండగా... గమనించని హరీశ్ దాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి