సూర్యాపేటలో ఈనెల 15న ఇద్దరు పిల్లల్ని చెరువులో తోసేసి ప్రాణాలు తీసిన కసాయి తల్లిని... పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం సాగిస్తున్న ప్రియుడిని మనువాడాలనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు విచారణలో తేలింది. జిల్లా కేంద్రంలో నివాసం ఉండే ప్రశాంత్, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్త ప్రవర్తనతో విసిగిపోయి పిల్లల్ని చెరువులో తోసేసిందని అందరూ భావించారు. కానీ ఘటనాస్థలిలో నాగమణి వ్యవహరించిన తీరు... అనుమానాలకు తావిచ్చింది. పథకం ప్రకారమే చిన్నారులను హత్య చేసిందంటూ... కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం పిల్లల్ని చంపింది' - suryapet news
ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి అయిన తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా ప్రియుడిని మనువాడాలనుకుంది. పిల్లల్ని హతమారిస్తేనే పెళ్లి చేసుకుంటానని షరతు విధించాడు ఆ ప్రబుద్ధుడు. ప్రియుడి కోసం సొంత పిల్లల్ని కడతేర్చింది ఏమి తెలియనట్టు వ్యవహరించింది ఓ కసాయి తల్లి.
సూర్యాపేట వాసి ఆటో డ్రైవర్ గట్టు మధుతో ఉన్న వివాహేతర సంబంధం వల్లే దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. ఈనెల 14న ఆదివారం రాత్రి భర్తతో గొడవపడి పిల్లలతో సద్దల చెరువు కట్టపైకి చేరుకుంది. అనంతరం ప్రియుడితో చరవాణిలో మాట్లాడగా... పిల్లలను హతమార్చితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్ల చెరువులోకి తోసేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం అక్కడకు వచ్చిన మధుతో... అదే ఆటోలో కర్కశతల్లి ఖమ్మం పరారైంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'ప్రేమ' వికటించింది.. పిల్లల్ని కన్నతల్లే నీటిలో తోసి చంపేసింది?