కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి - hyderabad latest news
08:56 July 28
కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు గత కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్ ఉన్నాడు.
సోమవారం రాత్రి మమత కూమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర రక్తస్రావంతో రియాన్ష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వేధింపులు తాళలేక అత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'