తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం మత్తు.. మామపై కోపం... కన్నకొడుకునే చంపేసింది! - telangana news updates

ప్రపంచంలో కన్న తల్లికంటే బిడ్డలను ఎవరూ అమితంగా చూసుకోలేరంటారు. కానీ రక్షించాల్సిన చేతులే... ప్రాణాలు తీశాయి. క్షణికావేశం, మద్యం ఈ రెండు ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలను తనే తీసుకునేలా చేశాయి. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

మద్యం మత్తులో రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది
మద్యం మత్తులో రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది

By

Published : Feb 3, 2021, 7:43 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడలో దారుణం చోటుచేసుకుంది. మామపై కోపం.. మద్యం మత్తులో తల్లి తన రెండేళ్ల కుమారుడిని గొంతుపిసికి చంపేసింది.

అసలేం జరిగిందంటే...

రామన్నగూడకు చెందిన దుంస పరమేశ్వరి మద్యానికి బానిసగా మారింది. భర్త శివకుమార్​ కూలీ పని చేసేవాడు. మంగళవారం భర్త పనికి వెళ్లాడు. సాయంత్రం పరమేశ్వరి కల్లు తాగింది. అది చూసి మామ వెంకటయ్య కోడలిని మందలించాడు. అదే కోపంతో మద్యం మత్తులో తన రెండేళ్ల కొడుకు ధనుశ్​కుమార్​ను చేతులతో గొంతు పిసికి చంపేసింది.

చుట్టు పక్కల వారికి తెలియడంతో 100కు కాల్​ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరమేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. బాబుని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details