చిన్న చిన్న గొడవలే కొన్నిసార్లు కుటుంబంలో పెను విషాదం నింపుతాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయే వాటికి కట్టలు తప్పిన ఆగ్రహం.. హత్యకు ఉసుగొల్పుతుంది. కన్న బంధాన్ని... కట్టుకున్న బాంధవ్యాన్ని తెంచేస్తుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న కుటుంబంలో కొందరు కాటికి చేరుతుంటే... నేరం చేసిన వాళ్లు జైలుకు పోతున్నారు.
భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి చంపాడు - హుజూర్‌నగర్‌లో హత్య భార్యా, కుమార్తెను హత్య చేసిన వ్యక్తి
08:58 January 21
భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి చంపాడు
కుటుంబ కలహాలతోనే ఓ వ్యక్తి భార్య, కుమార్తెను కిరాతకంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. కుటుంబ కలహాలతో... భార్య, కుమార్తెను రాడ్డుతో కొట్టి వెంకటేష్ అనే వ్యక్తి హత్య చేశాడు. పట్టణంలోని సాయిరూప గార్డెన్ వెనుక వీధికి చెందిన కొక్కిసల వెంకటేశ్ ఆటో డ్రైవర్. ఇతనికి భార్య రమ, కుమార్తె ఆమని ఉన్నారు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య, కుమార్తెపై ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమ, ఆమని ఘటనాస్థలిలోనే మృతి చెందారు.
ఆస్తి తగాదా.. కుటుంబ కలహాలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. భార్యా భర్తల మధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదా, కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్‌కు రమ రెండో భార్య. ఆమె పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై మార్చాలని తరచూ గొడవపడేవాడని పేర్కొన్నారు. దానితో పాటు వెంకటేశ్‌కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలుడు మృతి