తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రాణం మీదకు తెచ్చిన చేపల వేట - A man went for fishing and was seriously injured

జిలిటెన్​ స్టిక్​ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

A man went for fishing and was seriously injured
ప్రాణం మీదకు తెచ్చిన చేపల వేట

By

Published : May 10, 2020, 6:15 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని అగ్రహారం గుట్ట చెరువు వద్ద శనివారం జిలిటెన్‌ స్టిక్‌ పేలి బి.లచ్చయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

అగ్రహారంనకు చెందిన లచ్చయ్య గుట్ట వద్ద చెరువులోని బావిలో నాటు పద్ధతిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. బీరు సీసాలో జిలిటెన్‌ స్టిక్‌ పెట్టి అంటించే ప్రయత్నంలో అది ప్రమాదవశాత్తు పేలింది. ఘటనలో అతని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని స్థానికులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. బాధితుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details