తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - సికింద్రాబాద్​లో అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​లోని బేగంపేట్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని... హరియాణా రాష్ట్రం ఫరిదాబాద్​కు చెందిన అనిల్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

a man was suspicious death near Begumpet Airport in Secunderabad
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

By

Published : Jan 22, 2021, 6:52 AM IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​లోని బేగంపేట విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తిని... హరియాణా రాష్ట్రం ఫరిదాబాద్​కు చెందిన అనిల్ కుమార్​గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న దిల్లీ నుంచి ఒక పేషెంట్​ను హైదరాబాద్​లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వచ్చి జాయిన్ చేశాడు.

ఆ తరువాత అనిల్ కుమార్​ బేగంపేట్ విమానాశ్రయం సమీపంలోని హోటల్ బసకోసం చేరుకున్నాడు. పొద్దుపోయే వరకు ఎవరితోనే ఫోన్లో సంభాషించినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉన్నట్లు గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనిల్ కుమార్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమా? లేదా మరేదైనా కారణామా... అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:ఆదిలాబాద్​లో వ్యభిచార ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details