నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోస్గి పురపాలికలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కోస్గి బస్సు డిపో సమీపంలో వ్యక్తి కాళ్లు కట్టివేసి... మణికట్టు నరం కోసి దుండగులు అతి కిరాతంగా హతమార్చారు.
మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య! - telangana news
మానవత విలువలు రోజురోజుకూ మంటగలుస్తున్నాయి. మనిషి ప్రాణాలంటే లెక్క లేకుండా పోతోంది. మృగాల కన్నా కిరాతంగా తోటి మనుషులే చంపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతంగా హతమార్చారు. వ్యక్తి కాళ్లు కట్టేసి... మణికట్టు నరం కోసి కర్కశంగా చంపేశారు. అత్తింటి వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!
మృతుడు కొడంగల్ మండలం పరసాపూర్ వాసి అంజిలప్పగా పోలీసులు గుర్తించారు. అంజిలప్పను అత్తింటి వారే చంపి ఉంటారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:2020 రౌండప్: ట్రాఫిక్ జరిమానాల్లో ఇది ఆల్‌టైం రికార్డు