మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన సందీప్‌రెడ్డి అనే కెమెరామెన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సాయిరెడ్డి, నర్సమ్మ దంపతులకు సందీప్, శ్రవణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
సొంత గ్రామానికి వచ్చి..బలవన్మరణం - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అంతలోనే విగతజీవిగా మారి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
సొంత గ్రామానికి వచ్చి..బలవన్మరణం
సందీప్ హైదరాబాద్‌లో ఓ టీవీ ఛానెల్లో పనిచేస్తుండగా, అతని తమ్ముడు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకే గదిలో అన్నదమ్ములు నిద్రించిగా తెల్లవారేసరికి సందీప్ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.