కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పరిధిలోని చింతల్కి చెందిన భువన్ రెడ్డి. కొంతకాలంగా అతని భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 20 రోజుల క్రితం కలహాల కారణంగా అతని భార్య.. తన అక్క దగ్గరకు వెళ్లిపోయింది. భువన్ రెడ్డి స్నేహితుడితో కలిసి అక్కడకూ కూడా వెళ్లి వారిని కొట్టారు. దానిపై కేసు నమోదైంది.
భార్య ఇంటికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం - ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని సుదర్శన్‌రెడ్డినగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. భువన్ రెడ్డి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటలతో రోడ్డుపైకి వచ్చి వీధిలో పరిగెత్తాడు. స్థానికులు మంటలు ఆర్పివేసి ఆసుపత్రికి తరలించారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన భువన్ రెడ్డి ఈ రోజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం
Last Updated : May 15, 2020, 7:19 PM IST