తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం - Patancheru crime news

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

By

Published : Aug 17, 2020, 11:15 AM IST

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది. స్థానిక అంబేడ్కర్ కాలనీకి చెందిన మహ్మద్ నసీబ్... కొంతకాలంగా అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ... ఆదివారం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details