తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'నా కూతురిని ఇంటికి చేర్చండి...ఇదే నా చివరి కోరిక' - తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో అతను ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

a-man-selfie-suicide-in-east-godavari
'నా కూతురిని ఇంటికి చేర్చండి...ఇదే నా చివరి కోరిక'

By

Published : May 30, 2020, 4:09 PM IST

తన కుమార్తెకు మాయమాటలు చెప్పి ఓ యువకుడు వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరిలోవలో జరిగింది.

గ్రామానికి చెందిన గంజివరపు వీరవెంకటశివ కుమార్తెను.. అదే గ్రామానికి చెందిన అదీప్ రాజ్ మాయమాటలతో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకుని శివ తన కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు. వెంటనే రాజు తల్లి, మరో మహిళ వచ్చి తనపై దుర్బాషలాడి అవమానపర్చారని శివ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

తన కుమార్తెను రాజు మళ్లీ తీసుకువెళ్లిపోయాడని అతను చెప్పాడు. తన కుమార్తెను తల్లి వద్దకు చేర్చాలని గ్రామస్థులను కోరాడు. ఇదే తన చివరి కోరికని అన్నాడు. అనంతరం సమీపంలోని తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'నా కూతురిని ఇంటికి చేర్చండి...ఇదే నా చివరి కోరిక'

ఇదీ చదవండి:ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు దోచిన సైబర్ నేరగాళ్లు

ABOUT THE AUTHOR

...view details