నిజామాబాద్‌లో ఓ వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. నగరంలోని ఆర్యనగర్‌లో ఉమాకాంత్ అనే వ్యక్తి భార్యతో పాటు ఉంటున్నాడు. శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసారికి అతని భార్య.. సాల్మాన్ రాజ్(24) అనే వ్యక్తితో ఉంది.
ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఆవేశంతో భర్త ఏం చేశాడంటే..? - నిజామాబాద్‌లో హత్య
వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
భార్యను వేరొకరితో ఉండడం చూసి దాడి చేసిన భర్త
భార్య వేరొకరితో ఉండడం చూసిన ఉమాకాంత్.. ఆవేశంతో సాల్మాన్ రాజ్ తలపై రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో సల్మాన్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి:తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి