ప్రాణం తీసిన ఆవేశం - lorry
ఓ వ్యక్తి ఆవేశం మరో వ్యక్తిని బలిగొంది. చిన్న మాట అన్నందుకు ఆవేశంతో ఘర్షణకు దిగి ప్రాణం తీశాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగింది.
మహ్మద్ రహీం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు లారీ నడుపుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఉదయం బెల్లంపల్లి రైల్వే వంతెన వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో బైక్పై వస్తున్న వ్యక్తి లారీని ప్రమాదకర స్థితిలో దాటపోయాడు. లారీ డ్రైవర్ రహీం చస్తావా అంటూ బైకిస్ట్ను గద్దించాడు. అంతే..బైక్పై వెళ్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. లారీని వెంబడించి రహీంతో ఘర్షణకు దిగాడు. లారీ డ్రైవర్ చాతీపై కొట్టడం వల్ల రహీం అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇవీ చూడండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం