సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన పగిళ్ల వెంకన్న, పగిళ్ల సోమయ్యకు భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వ్యవసాయ పొలం వద్ద సోమయ్యపై వెంకన్న అతని కుమారుడు అనిల్ కలిసి కర్రలతో దాడి చేశారు.
మద్దిరాలలో ఘర్షణ.. ఒకరికి గాయాలు
భూ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాలలో చోటుచేసుకుంది.
మద్దిరాలలో ఘర్షణ.. ఒకరికి గాయాలు
ఈ దాడిలో సోమయ్య గాయపడ్డారు. అతన్ని తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై మద్దిరాల ఎస్సైని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఇదీ చదవండి:సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పరిధిలో అగ్నిప్రమాదం