సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మద్యం మత్తులో గొంతు కోసుకొని హల్చల్ చేశాడు. మధ్యాహ్నం సమయంలో ఫుల్‌గా తాగి పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న బ్లేడు తీసుకుని గొంతు దగ్గర కోసుకుంటూ తన వద్దకు ఎవరూ రావద్దని అరుపులు కేకలు పెట్టాడు.
మద్యం మత్తులో గొంతు కోసుకొని ఓ వ్యక్తి హల్చల్ - A alcoholic person hul chal updates
ఓ వ్యక్తి మద్యం మత్తులో గొంతు కోసుకొని హల్చల్ చేసిన ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Breaking News
వెంటనే పోలీసులు అతన్ని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించే క్రమంలో కూడా తన వద్దకు ఎవరైనా వస్తే గొంతు కోసుకుంటా అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. ఆంబులెన్స్‌లో కొద్ది దూరం వెళ్లే వరకు కూడా అదేవిధంగా అరుస్తూ గొడవ చేశాడని పోలీసులు తెలిపారు. చివరికి అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఫుట్‌పాత్‌పై నివసిస్తూ జీవనం సాగించే మధు అనే వ్యక్తి ఈ ఘాతుకాన్ని పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మద్యం తాగినప్పుడల్లా సైకోలా మారుతాడని స్థానికులు చెప్పారు.