తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'అన్న నుంచి ప్రాణ హాని ఉంది.. కాపాడండి' - హెచ్​ఆర్సీ వార్తలు

అన్న నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి హెచ్​ఆర్సీని ఆశ్రయించాడు. రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. కబ్జాదారుడైన తన అన్నకు మద్దతు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.

a-man-filed-harassment-case-on-his-brother-in-hrc
'అన్న నుంచి ప్రాణ హాని ఉంది.. కాపాడండి'

By

Published : Dec 23, 2020, 12:46 PM IST

సికింద్రాబాద్ నార్త్ లాలాగూడా ప్రాంతానికి చెందిన ముత్యాలు రక్షణ కల్పించాలంటూ... హెచ్చార్సీని ఆశ్రయించాడు. అన్న శంకర్​కు, తనకు రెజిమెంటల్ బజార్ దర్గా ప్రాంతంలో... 54 గజాల ఉమ్మడి స్థలం ఉందని... దానిలో తన అనుమతి లేకుండా శంకర్​ నిర్మాణం చేపట్టాడని తెలిపాడు.

ఈ విషయమై అన్నను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని కమిషన్​కు తెలిపాడు. మున్సిపల్​, గోపాలపురం పోలీస్ అధికారులను కలిసినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయాడు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపాడు. నిర్మాణం నిలిపేయాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ... లెక్కచేయకుండా నిర్మాణం చేస్తున్నాడని ఆరోపించాడు. కోర్టులో కేసు వేసినందుకు తనను, తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించి... తన అన్నకు మద్దతుగా నిలుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్​ఆర్సీని కోరాడు.

ఇదీ చూడండి:'నా కూతురిని తీసుకురాకపోతే ఇక్కడే చచ్చిపోతాను'

ABOUT THE AUTHOR

...view details