నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జోలపురంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో పడి వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామానికి చెందిన వెంకటేష్‌కు మానసిక పరిస్థితి సరిగా లేదు. దీనికి తోడు మూర్ఛ వ్యాధి ఉంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటేష్.. జోలపురంలోని చెరువులో శవమై కనిపించాడు.
చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి - నారాయణపేట జిల్లా నేర వార్తలు
ప్రమాదవశాత్తు చెరువులో పడి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
చెరువులో పడి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి మృతి
వెంకటేష్ కాలకృత్యాలకు వెళ్లి మూర్ఛ రావడంతో చెరువులో పడి మృతి చెంది ఉంటాడని మక్తల్ ఎస్సై రాములు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి.. ఆపగలమా ఆ తల్లి శోకాన్ని.. ఓదార్చగలమా ఆ తండ్రిని...