సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌కు చెందిన నాయికోటి బుచ్చయ్య (50), అతని స్నేహితుడు జగన్ మంగళవారం నీటి సంపు వద్ద వెళ్లారు. బుచ్చయ్య ఈత కొడతానంటే స్నేహితుడు జగన్ నీటి సంపులోకి దిగమన్నాడు. అయితే అతనికి ఈతరాకపోవడం వల్ల మునిగిపోతుండగా జగన్ తాడు వేసినా బుచ్చయ్య బయటకు రాలేకపోయాడు.
ఈత రాదు అయినా సంపులో దిగాడు
ఓ వ్యక్తి ఈతకోసం నీటి సంపులో దిగి మునిగి చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈత రాదు అయినా సంపులో దిగాడు
పైన ఉన్న జగన్‌కు ఏం చేయాలో తెలియక వెంటనే సంపులో ఉన్న నీటిని మోటారు సహాయంతో బయటకు తోడేసాడు . అప్పటికే బుచ్చయ్య చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.