సిద్దిపేట జిల్లా రామాయంపేటకు చెందిన కుర్ర రాములు(65).. దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్కు చెందిన అల్లుడు నర్సింహులు ఇంటికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న అల్లుడు నర్సింహులు అతడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
కాలువలో పడి వృద్ధుడు మృతి - Etv bharath
ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Breaking News
ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి