పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది తీరానికి మంథని మండలం తోటగోపయ్యపల్లి గ్రామానికి చెందిన బొందుగుల రాజేందర్ అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేయడానికి వచ్చారు. ముందుగా రాజేందర్ నదిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడిక్కడే మృతి చెందాడు.
'గోదావరి నదిలో స్నానానికి వెళ్లి.. శవమై తిరిగొచ్చాడు'
కార్తీక సోమవారం సందర్భంగా గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది.
'గోదావరి నదిలో స్నానానికి వెళ్లి.. శవామై తిరిగొచ్చాడు'
తల్లిదండ్రుల కళ్ల ముందే కన్నకొడుకు చనిపోతుంటే.. ఆ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. వెంటనే మృతదేహాన్ని మంథని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.