నీరనుకుని శానిటైజరును మద్యంలో కలుపుకొని తాగిన డ్రైవరు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భోజ్యతండా పంచాయతీ పరిధి మాల్యతండాలో చోటు చేసుకుంది.
మద్యంలో శానిటైజర్ కలుపుకొని తాగేశాడు..
నీరనుకుని మద్యంలో శానిటైజర్ కలుపుకుని తాగి అస్వస్థతకు గురైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేటలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తండాకు చెందిన ఏడుగురు కూలీలు ఆదివారం వైకుంఠధామం పనుల్లో పాల్గొన్నారు. వారితో పాటు పంచాయతీ చెత్త ట్రాక్టరు డ్రైవరుగా పని చేస్తున్న దీప్లా మద్యం తాగేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన వారు మద్యంలో శీతల పానీయం కలుపుకొని తాగగా.. దీప్లా మాత్రం పంచాయతీ కార్యాలయంలోని సీసాలో ఉన్న శానిటైజర్‌ను నీరనుకుని మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అతను అక్కడే వాంతులు చేసుకుని పడిపోగా మిగిలిన కూలీలు ఏమీ కాదని చెబుతూ అతన్ని ఇంట్లో వదిలారు. ఉదయం నిద్ర లేవకపోవడంతో అనుమానించిన అతని భార్య కమల సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు
ఇదీ చూడండి:గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు