ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇవాళ విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఫతేనగర్‌కు చెందిన వెంకట నాయుడుకి బాలానగర్‌లోని ఓ చిన్న ఇంజినీరింగ్ పరిశ్రమ ఉంది. బుధవారం పడిన భారీ వర్షానికి తన పరిశ్రమలోకి నీరు చేరటం వల్ల మూసేశాడు.
పరిశ్రమలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి - balanagr news
హైదరాబాద్ ఫతేనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఐదు రోజుల కింద కురిసిన వర్షానికి మరో ప్రాణం బలైంది. ఐదు రోజుల తర్వాత తీసిన పరిశ్రమలోని మిషన్ ఆన్ చేయగా... కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
![పరిశ్రమలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి a man died with current shock in fathe nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9225402-595-9225402-1603038119238.jpg)
a man died with current shock in fathe nagar
శనివారం పరిశ్రమలోకి వెళ్లి నీటిని ఎత్తిపోసి... శుభ్రం చేసుకున్నాడు. తిరిగి పరిశ్రమకు వెళ్లి మిషన్ ఆన్ చేయగా... ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న తన భార్య హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.