ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం సింగాయిపల్లి శివారులో చోటు చేసుకుంది. ముత్తిరెడ్డిపల్లికి చెందిన జి విష్ణువర్ధన్‌రెడ్డి(50), తన భార్య అరుంధతి కలసి ద్విచక్రవాహనంపై వనపర్తిలోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకొని గ్రామానికి తిరిగి వస్తున్నారు. సింగాయిపల్లి సమీపంలో మిట్ట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై నుంచి వ్యవసాయ పొలంలోకి దూసుకుపోయింది.
ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... భర్త మృతి - kodair news
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం సింగాయిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్తున్న ఆ దంపతులను ఆ రోడ్డు ప్రమాదం కబళించింది. భర్త అక్కడికక్కడే మృతి చెందగా... భార్య తీవ్రంగా గాయపడింది.
a man died in bike accident in singaipally
పొలంలో విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టడంతో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా అరుంధతికి చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.