యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతరం గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమార్(30) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుడు ఇట్టబొయిన రమేశ్‌తో కలసి కుమార్ వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి గ్రామానికి వెళ్తున్నారు. ఆలేరు - గుండాల ప్రధాన రహదారిపై వెళ్తున్నవాళ్లను కళ్లెం గ్రామానికి చెందిన సంగీ కాంతయ్య బైక్‌తో ఢీ కొట్టాడు.
ఆలేరు - గుండాల రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి - kanneboina kumar died in a road accident
యాదాద్రి జిల్లా ఆలేరు - గుండాల ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అనంతరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆలేరు - గుండాల రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి
తీవ్ర గాయాలపాలైన అతన్ని 108 వాహనంలో ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు గుండాల ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.