తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విడాకులిస్తానన్న భార్య.. నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య - మేడ్చల్​ జిల్లా వార్తలు

భార్య కాపురానికి రాలేదని ఒంటికి నిప్పంటించుకున్నాడు జీడిమెట్లకు చెందిన ఓ వ్యక్తి. తీవ్రగాయాలైన భువన్‌సూర్యరెడ్డి(31)ని నిన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

a-man-died-by-family-problems-in-jeedimetla
భార్య విడాకులిస్తానంటే ఆత్మహత్య చేసుకున్నాడు

By

Published : May 16, 2020, 5:40 PM IST

భార్య ఇంటికి తిరిగి రావడం లేదంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో రహదారిపైనే నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన కె.భువన్‌సూర్యరెడ్డి(31) నగరంలోని చింతల్‌లో ఉంటూ రెండేళ్లక్రితం స్థానిక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగు నెలల పాప ఉంది. భువన్‌ గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండడంతో ఆమె వెంకటేశ్వరనగర్‌లోని సోదరి ఇంటికి వెళ్లిపోయింది.

మద్యం మత్తులో రహదారిపైనే నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం

శుక్రవారం మద్యం మత్తులో భార్య సోదరి ఇంటికి వెళ్లి భువన్‌ గొడవ చేశాడు. ఆమె విడాకులు ఇస్తానని చెప్పింది. మనస్తాపానికి గురైన భువన్​ నిన్న !ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొన్నాడు. మంటలతో రోడ్డుపైకి వచ్చాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన భువన్​ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


ఇవీ చూడండి:పుట్టింటికి పంపలేదని మహిళ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details